ఓగిపూర్ నాపరాతి గనులు,కర్మాగారాల్లో దొంగల హల్చల్

ఓగిపూర్ నాపరాతి గనులు, కర్మాగారాల్లో దొంగల హల్చల్

వికారాబాద్ జిల్లా | తాండూర్

తాండూర్ మండలం ఓగిపూర్ గ్రామంలోని నాపరాతి గనులు,కర్మాగారాల్లో దొంగలు హల్చల్ చేస్తున్నారు. గనుల్లో విద్యుత్ సరఫరాకు ఉపయోగించే కాపర్ వైర్లను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు సమాచారం.

కర్మాగారం యజమాని హర్షవర్ధన్ రెడ్డి ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ నాపరాతి గనుల్లో కాపర్ వైర్ల చోరీలు తరచూ జరుగుతున్నాయని కర్మాగారాల నిర్వాహకులు చెబుతున్నారు.

వరుస చోరీలతో కర్మాగారాల యజమానులు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, చోరీలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.