బెల్ట్ షాపుల నిషేధాన్ని గ్రామసభ ఆమోదించింది.

 🔴 వాడి వేడిగా గ్రామసభ

🔴 బెల్ట్ షాపుల నిషేధాన్ని అంతారం గ్రామంలో గ్రామసభ ఆమోదించింది.

నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::

వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అంతారం గ్రామంలో సర్పంచు జంగని లక్ష్మి ఆధ్వర్యంలో గురువారం ప్రజా పాలనలో భాగంగా రైతు వేదికలో ఏర్పాటు చేసిన గ్రామసభ వాడి వేడిగా జరిగింది. అయితే గ్రామంలో బెల్ట్ షాపుల నిషేధాన్ని అమలు చేయాలంటూ చేసిన పంచాయితీ తీర్మానాన్ని గ్రామ సభ ఆమోదం తెలిపింది.

దీంతో మధ్య నిషేధం అమలుపై కొద్దిసేపు వాడి వేడిగా చర్చ కొనసాగింది. అదేవిధంగా గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను సభ్యులు, ప్రజలు సభ దృష్టికి తేవడంతో త్వరలో సమస్యలను పరిష్కరిస్తామని సర్పంచు జంగని లక్ష్మి మరియు గ్రామ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఈ గ్రామసభలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, మాజీ సర్పంచ్ వడ్డె రాములు, మాజీ ఉపసర్పంచ్ జీవరత్నం, పిఎసిఎస్ మాజీ డైరెక్టర్ పెండ నర్సింలు, సర్పంచ్ జంగని లక్ష్మి, ఉపసర్పంచ్ వడ్డే రవి, గ్రామ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, విద్యుత్తు లైన్మెన్ మహమ్మద్ అక్తర్, ప్రధానోపాపాధ్యాయులు, అంగన్వాడి ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.