తప్పు చేయని రోహిత్ రెడ్డి ఎందుకు తప్పించుకొని తీరుగుతున్నావ్
కాంగ్రెస్ పార్టీ నాయకులు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులు అసత్య ప్రచారాలను ఖండించిన మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి.
సందర్బంగా మాట్లాడుతూ.. కుట్రలు కుతంత్రాలు చేసి ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసిన కూడా తాండూర్ ప్రజల ఓటు దెబ్బతో ఓడిపోయిన రోహిత్ రెడ్డి, ఓటమిని జీర్ణించుకోక ఉన్మాదంతో కౌంటింగ్ సెంటర్ వద్ద ఎన్నికల విధులలో ఉన్న పోలీసు అధికారుల మీద దాడి చేసి తప్పించుకొని పారిపోయి పరారీలో ఉన్న రోహిత్ రెడ్డి.
బహిరంగంగా దాడి చేసి ఎలాంటి తప్పు చేయలేదని సమర్థించుకోవడం సిగ్గుచేటు. ఇది రోహిత్ రెడ్డి రౌడీయిజానకి నిదర్శనం.
ఎలాంటి నేరం చేయకపోతే చట్టం ముందుకు వచ్చి సమాధానం చెప్పలని డిమాండ్ చేశారు.
చట్టాన్ని కాపాడే పోలీసుల మీద దాడి చేసిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పైన చట్టరీత్య కఠినమైన చర్యలు తీసుకోవాలని తాండూరు ప్రజలు కోరుకుంటున్నారన్నారు..
అదే విధంగా చేసిన తప్పును కప్పిపుచ్చకోవాడనికీ అధికార పార్టీపై నిందలు మెపడం అనేది నీ పిరికితనంకు మరియు నీ దొంగ పనులకు నిదర్శనం.
కౌటింగ్ రోజు నీ పార్టీ నీ అభ్యర్థులు ఓడిపోయారనే ప్రాస్టేషన్ లో డ్రగ్స్ తీసుకొని ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులపై చేయ్యి చేసుకోవడం అనేది నీకు ఎంత వరకు సమంజసం మరియు అక్కడ ఉన్న వారిని రెచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించిన నీపై కేసులు కాకపోతే మరేం అవుతాయన్నారు.
చట్టం తనపని తాను చేసుకుంటుందని, దీనిలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని మీడియా ముందు తెలిపారు.
