ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి ‘డయల్ యువర్ డీఎం’

వికారాబాద్ జిల్లా..

ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి ‘డయల్ యువర్ డీఎం’

తాండూరు: ప్రయాణికుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు తాండూరు ఆర్టీసీ డిపో పరిధిలో ఈ నెల 14వ తేదీ బుధవారం ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. తాండూరు డిపో పరిధిలోని ప్రయాణికులు తమ సమస్యలు, సూచనలను సెల్ నంబర్ 9063469572 కు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు.

ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ సూచించారు.