సమాన పనికి సమాన వేతనం కల్పించాలంటూ FMGE ఇంటర్న్‌లు చేపట్టిన నిరసన మూడో రోజుకు చేరింది.

వికారాబాద్ జిల్లా | తాండూరు

సమాన పనికి సమాన వేతనం కల్పించాలంటూ FMGE ఇంటర్న్‌లు చేపట్టిన నిరసన మూడో రోజుకు చేరింది.

వికారాబాద్ జిల్లా తాండూరు పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాల, కొడంగల్‌కు సంబంధించిన ఆసుపత్రి వద్ద FMGE హౌస్ సర్జన్లు తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తున్నారు.

సుప్రీంకోర్టు, నేషనల్ మెడికల్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం తమకు నెలకు రూ.29,792 స్టైపెండ్ చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం తమకు నెలకు కేవలం రూ.5,000 మాత్రమే అందుతోందని, పెరుగుతున్న రోజువారీ ఖర్చుల నేపథ్యంలో ఈ మొత్తం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వైద్య సేవల్లో ఇంటర్నేషనల్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అయిన FMGE ఇంటర్న్‌లు, భారతదేశంలో వైద్య విద్యను అభ్యసించిన IMG ఇంటర్న్‌లతో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ, స్టైపెండ్ విషయంలో వివక్ష ఎదుర్కొంటున్నామని వారు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో OP, OT, వార్డు సేవలను బహిష్కరిస్తూ నిరసన కొనసాగిస్తున్నారు. స్టైపెండ్ విషయంలో తెలంగాణ వైద్య మండలి నుంచి స్పష్టమైన అధికారిక ఉత్తర్వులు వచ్చే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

అధికారుల నుంచి సానుకూల స్పందన రాకపోతే ఈ నెల 14న హైదరాబాద్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) కార్యాలయం లేదా ధర్నా చౌక్ వద్ద నిరసన చేపడతామని హెచ్చరించారు.

సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, తమకు న్యాయంగా రావాల్సిన స్టైపెండ్‌ను వెంటనే చెల్లించాలని FMGE ఇంటర్న్‌లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.