తాండూరులో కొలువుదీరిన నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం
తాండూర్, వికారాబాద్ జిల్లా:
తాండూరు పట్టణంలోని క్లాసిక్ గార్డెన్స్‌లో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్‌గా వడ్డే శ్రీనివాస్, వైస్ చైర్మన్‌గా షేక్ కాశీంతో పాటు నూతన పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన చైర్మన్, వైస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా మార్కెట్ కమిటీని సమర్థవంతంగా నిర్వహించి, రైతులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. తాండూరు ధాన్యానికి మంచి గ్రేడింగ్‌తో పాటు మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి అందరూ కలిసి కృషి చేయాలని అన్నారు.
తాను రైతుగా రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకున్నానని, రైతుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటానని ఎమ్మెల్యే తెలిపారు. ఒక సంవత్సరం లోపు నూతన మార్కెట్ యార్డును ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
