న్యూఢిల్లీలో కాంగ్రెస్ లోక్‌సభ చీఫ్ విప్ కొడికున్నిల్ సురేష్‌తో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వక భేటీ

వికారాబాద్ జిల్లా | తాండూర్

న్యూఢిల్లీలో కాంగ్రెస్ లోక్‌సభ చీఫ్ విప్ కొడికున్నిల్ సురేష్‌తో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వక భేటీ

తాండూర్, ఆగస్టు 5: నిజ స్వరం ప్రతినిధి

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ చీఫ్ విప్ కొడికున్నిల్ సురేష్‌ను RBOL CEO, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (BSR) మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అలాగే ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.

అనంతరం కొడికున్నిల్ సురేష్‌కు బుయ్యని శ్రీనివాస్ రడ్డి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజాసేవలో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ భేటీ ఆత్మీయ వాతావరణంలో జరిగినట్లు బుయ్యాని శ్రీనివాసరెడ్డి వెల్లడించాయి.