వికారాబాద్ జిల్లా తాండూర్
విద్యార్థి సుశాంత్‌కు CMRF చెక్కు అందించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూర్, వికారాబాద్ తాండూర్
బషీరాబాద్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో ఇటీవల నిర్వహించిన జోనల్ స్థాయి క్రీడా పోటీల సందర్భంగా విద్యార్థి సుశాంత్‌పై చెట్టు కొమ్మ అకస్మాత్తుగా విరిగి పడడంతో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. తలకు తీవ్ర గాయాలైన సుశాంత్ హైదరాబాద్‌లోని ఆలివ్ ఆసుపత్రిలో చికిత్స పొందగా, ఇటీవల పూర్తిగా కోలుకున్నాడు.
ఈ నేపథ్యంలో సుశాంత్ వైద్య చికిత్సకు సంబంధించి రూ.1,43,200 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కును తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో విద్యార్థికి అందజేశారు.
అంతకుముందు చికిత్స ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వ్యక్తిగతంగా రూ.20,000 ఆర్థిక సహాయం కూడా కుటుంబ సభ్యులకు అందించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా తమ కుమారుడి చికిత్స కోసం అన్ని విధాలుగా అండగా నిలిచి, ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి సుశాంత్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
