వర్షాలు సమృద్ధిగా కురవాలని.. పంటలు బవరుణ యాగంలో పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే BMR గంజ్ ఆవరణలో రుద్రాభిషేకం, జలాభిషేకం, పంచసూక్త హోమం ఘనంగా నిర్వహణ

వికారాబాద్ జిల్లా, తాండూర్:

రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ తాండూర్ గంజ్ ఆవరణలో ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్–తాండూర్ ఆధ్వర్యంలో ప్రత్యేక రుద్రాభిషేకం, జలాభిషేకం, పంచసూక్త హోమం, వరుణ యాగం ఘనంగా నిర్వహించారు.

ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతుల సంక్షేమం, సకాలంలో వర్షాలు కురిసి వ్యవసాయం అభివృద్ధి చెందాలని, ప్రతి రైతు కుటుంబం ఆనందంగా ఉండాలని ఆయన ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు, వ్యాపారులు, రైతులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని యాగంలో భాగస్వాములయ్యారు.