పాత తాండూర్ ప్రజల సమస్యకు పరిష్కారం.. తెరుచుకున్న రైల్వే గేట్

వికారాబాద్ జిల్లా – తాండూర్

పాత తాండూర్ ప్రజల సమస్యకు పరిష్కారం.. తెరుచుకున్న రైల్వే గేట్

పాత తాండూర్ ప్రాంత ప్రజలు రైల్వే గేట్ కారణంగా ఎదుర్కొంటున్న రాకపోకల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, 16వ వార్డు కౌన్సిలర్ నారా శ్రీలత శ్రీకాంత్, 14వ వార్డు కౌన్సిలర్ షఫీ తాండూర్ రైల్వే పీడబ్ల్యూ అధికారి శరత్‌ను కలిసి సమస్యను వివరించారు.

ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకెళ్లగా, శరత్ సానుకూలంగా స్పందించి ఇచ్చిన హామీ మేరకు ఈరోజు రైల్వే గేట్‌ను తెరవించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం చేపట్టిన ఈ చర్యపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.