విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి

వికారాబాద్ జిల్లా తాండూరు

విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి

తాండూర్:  పట్టణంలోని 28వ వార్డులో గల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి విద్యార్థులకు యూనిఫాంలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల విద్యాభివృద్ధికి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

అనంతరం విద్యార్థులకు చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి, నాయకులు అల్పాహారం అందించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, స్థానిక కౌన్సిలర్ నాగారం మల్లేశం, నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.