వికారాబాద్ జిల్లా…
వికారాబాద్ రాజకీయాల్లో బీఎస్ఆర్ కీలకంగా మారనున్నారా?
రాజకీయాల్లో బీఎస్ఆర్ ముందడుగులు…!
తాండూరు: వికారాబాద్ జిల్లా రాజకీయాల్లో మంగళవారం చోటుచేసుకున్న ఓ కీలక భేటీ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్‌రెడ్డి.. తాండూరుకు చెందిన ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి (బీఎస్ఆర్) నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
ఇద్దరి మధ్య సుమారు రెండు గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరగడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇంతసేపు ఏ అంశాలపై చర్చించారు? ఇది కేవలం మర్యాదపూర్వక భేటీయేనా? లేక జిల్లా రాజకీయాలపై కీలక చర్చ జరిగిందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.
సమావేశానికి సంబంధించిన వివరాలు అధికారికంగా బయటకు రాకపోవడంతో రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మరింత పెరుగుతున్నాయి. బీఎస్ఆర్‌తో చీఫ్ విప్ మహేందర్‌రెడ్డి భేటీ వెనుక రాజకీయ సమీకరణాలేమైనా ఉన్నాయా? రాబోయే రోజుల్లో బీఎస్ఆర్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నారా? అనే చర్చ జోరందుకుంది.
మరోవైపు.. వికారాబాద్ జిల్లా రాజకీయాల్లో బీఎస్ఆర్ పేరు ఇప్పటికే వినిపిస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఇది భవిష్యత్ రాజకీయ పరిణామాలకు సంకేతమా? బీఎస్ఆర్‌కు ఏదైనా కీలక బాధ్యత అప్పగించే ప్రయత్నమా? లేక సాధారణ సమావేశమేనా? అన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే.. ఈ సుదీర్ఘ భేటీ వెనుక అసలు మతలబేంటి? బీఎస్ఆర్ రాజకీయాల్లోకి మరింత యాక్టివ్‌గా అడుగులు వేస్తున్నారా? రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయి? అన్నదే ఇప్పుడు వికారాబాద్ జిల్లా రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
