వికారాబాద్ జిల్లా తాండూర్
తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ
వికారాబాద్ జిల్లా, తాండూర్: తాండూర్ మున్సిపల్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్రెడ్డి ఆవిష్కరించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించి, దేశభక్తిని చాటుకున్నారు.
అనంతరం అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు.
మున్సిపాలిటీ అభివృద్ధికి అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
