తాండూర్‌లో ఘనంగా విఠల్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

వికారాబాద్ జిల్లా తాండూర్

తాండూర్‌లో ఘనంగా విఠల్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

తాండూర్: బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పంజుగుల విఠల్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం తాండూర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. విఠల్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, ప్రజా సేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

వేడుకలతో క్యాంపు కార్యాలయం సందడిగా మారింది. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విఠల్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, మహిళా నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.