స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మాంసం దుకాణాలు, కబేళాలు, మాంసాహారాలు నిర్వహించే హోటళ్ల మూసివేయాలంటూ నోటీసులు జారీ

వికారాబాద్ జిల్లా తాండూరు

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మాంసం దుకాణాలు, కబేళాలు, మాంసాహారాలు నిర్వహించే హోటళ్ల మూసివేయాలంటూ నోటీసులు జారీ

తాండూరు: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 15వ తేదీన తాండూరు పట్టణ పరిధిలోని మాంసం విక్రయ దుకాణాలు, మేకలు–పశువుల కబేళాలు, మాంసాహారం విక్రయించే హోటల్లు మూసివేయాలని తాండూరు పురపాలక సంఘం కమిషనర్ ఆదేశించారు.

మట్టన్, చికెన్, చేపలు తదితర మాంసాహార పదార్థాలను 15.08.2026న విక్రయించరాదని నోటీసులో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించి మాంసాహార విక్రయాలు చేపడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పురపాలక అధికారులు హెచ్చరించారు.

– పురపాలక సంఘం, తాండూరు