వికారాబాద్ జిల్లా…
సాయిపూర్‌లో ‘ఆదిత్య ఆస్పత్రి’ ప్రారంభం
తాండూరు: తాండూరు పట్టణంలోని సాయిపూర్‌లో డా. భీంశెట్టి శరత్ చంద్ర, డా. శ్రావణి దంపతులు నూతనంగా ఏర్పాటు చేసిన **‘ఆదిత్య ఆస్పత్రి’**ని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) ప్రారంభించారు.

వైద్య రంగంలో సేవలందిస్తున్న డా. శరత్ చంద్ర, డా. శ్రావణి దంపతులు తాండూరు ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఆధునిక వైద్య సదుపాయాలతో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి డా. శరత్ చంద్ర, డా. శ్రావణి దంపతులకు అభినందనలు తెలిపారు. తాండూరు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ, పేద, మధ్యతరగతి ప్రజలకు సైతం మెరుగైన వైద్యం అందుబాటులో ఉండేలా సేవలు కొనసాగించాలని సూచించారు.
