8వ వార్డులో మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి పర్యటన త్వరలో రూ.25 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం

వికారాబాద్ జిల్లా తాండూర్

🔴 8వ వార్డులో మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి పర్యటన

🟣 త్వరలో రూ.25 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం

నిజ స్వరం తాండూర్ ప్రతినిధి ::

తాండూరు: తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి 8వ వార్డులో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ అధికారులు, సిబ్బందితో కలిసి వార్డులో పర్యటించి అభివృద్ధి పనులపై సమీక్షించారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ 8వ వార్డును దశలవారీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. త్వరలోనే రూ.25 లక్షల నిధులతో సీసీ రోడ్డు తదితర అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని పేర్కొన్నారు. వార్డులో చేపట్టాల్సిన మిగిలిన అభివృద్ధి పనుల వివరాలను తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, ఆయన సహకారంతో పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని అన్నారు.

రాజీవ్, ఇందిరమ్మ కాలనీలను కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని, ఆయా కాలనీల అభివృద్ధికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందని నీరజ బాల్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ పర్యటనలో 8వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ కమిషనర్, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానికులు

ఈ కార్యక్రమంలో వార్డ్ నెంబర్ 8 ఇంచార్జ్ సాయప్ప. మాజీ కౌన్సిలర్ వెంకన్న గౌడ్, డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ అర్షయా ఖాన్, ఇందిరమ్మ కాలనీ రాజీవ్ కాలనీ మహిళా ఇన్చార్జ్, అడ్వకేట్ జిలాని, మోయిస్, యూసుఫ్, 8 వ నెంబర్ వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.