వికారాబాద్ జిల్లా | తాండూర్
ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
తాండూర్, ఆగస్టు 5: తాండూర్ శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని తాండూర్ మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నూరేళ్ల ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థానాలను అధిరోహిస్తూ ప్రజల ఆదరణను పొందాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా తాండూర్ నియోజకవర్గ ప్రజలకు శాంతి, సుభిక్షం, అభివృద్ధి చేకూరాలని స్వామివారిని ప్రార్థించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించగా, ఎమ్మెల్యే సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్షు కలిగి ప్రజాసేవలో మరింత విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించి భక్తులతో కలిసి ప్రార్థనలు చేశారు.
మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నాయకత్వంలో తాండూర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ఆయన చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలు మరింత విస్తరించాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.
