కాంగ్రెస్ మంత్రుల పర్యటన- బిఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్

వికారాబాద్ జిల్లా…

తాండూరులో బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్.. కాంగ్రెస్ మంత్రుల పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత

తాండూరు పట్టణంలో కాంగ్రెస్ మంత్రుల పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

తాండూరు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పట్లోళ్ల దీప నర్సింలును శనివారం ఉదయం ఇంటి వద్దనే పోలీసులు నిలువరించినట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలింపు వంటి ప్రజా సమస్యలను పక్కనబెట్టి ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోతోందని విమర్శించారు.