🔴 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కి ఉప ముఖ్యమంత్రి కి పాలాభిషేకం.
నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::
వికారాబాద్ జిల్లా తాండూర్ లో,ఆంధ్రప్రదేశ్ రాష్టంలో, ఉగాది పండుగను పునస్కరించుకొని దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించినందుకు అలాగే,
దివ్యాంగుల ఆసరా పెన్షన్ 6 వేల రూపాయలు పెంపు చేసినందుకు గాను,భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, ఉప ముఖ్య మంత్రి, కొణిదెల పవన్ కళ్యాణ్ కి పాలాభిషేకం చెయ్యడం జరిగింది.
ఈ సందర్బంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నర్సిములు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్టంలో అశేంబ్లీ ఎన్నికలలో హామీ ఇవ్వకున్నా కూడా, మానవత్వ దృక్పధంతో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యం కల్పించినందుకు, ముందుగా సిఎం,చంద్రబాబు నాయుడు కి,డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ , రవాణా శాఖా మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు, తదుపరి వారి ఫోటోలకు పాలాభిషేకం చేశారు.
మన తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అశేంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో లో దివ్యాంగులకు హామీ ఇచ్చి , 2 సంవత్సరాలు దాటిన కూడా, ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ నెరవేర్చలేడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ని ఆదర్శంగా తీసుకొని, వెంటనే తెలంగాణ రాష్టంలో కూడా, ఆసరా పెన్షన్ ల పెంపు,మరియు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,
ఈ కార్యక్రమంలో, తాండూర్ సీనియర్ నాయకులు చందు, గజేలప్ప, రాజాసింగ్, నర్సిములు,మొగుళప్ప వివిధ గ్రామాల వికలాంగులు తదితరులు పాల్గొన్నారు.
