🔴 కాగ్న నుండి తాండూర్ పట్టణానికి నీటి సరఫరాకు కసరత్తు.
నిజ జ్వరం తాండూర్ ప్రతినిధి ::
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఉన్న నీటి సరఫరాతో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు చర్యలు వేగవంతం అవుతున్నాయి.
గతంలో తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కాగ్న నది నుండి పట్టణానికి త్రాగునీరు అందిస్తామని ఇచ్చిన హామీ మేరకు కసరత్తు కొనసాగుతోంది.
దీనిలో భాగంగా ఈ రోజు తాండూర్ మున్సిపల్ చైర్మన్ నీరజ బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి మరియు కౌన్సిలర్లు కలిసి కాగ్న పంపు హౌస్‌ను సందర్శించారు.
నీటి సరఫరా అమలు, సాంకేతిక అంశాలు, అవసరమైన వనరులు మరియు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు సమగ్రంగా చర్చించారు.
పట్టణ ప్రజలకు తగిన మోతాదులో శుద్ధి చేసిన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించారు.
తాండూర్ ప్రజలకు శాశ్వత నీటి సమస్య పరిష్కారమే లక్ష్యంగా మున్సిపల్ యంత్రాంగం కట్టుదిట్టంగా ముందుకు సాగుతోందని చైర్ పర్సన్ తెలిపారు.
