🔴 ఆర్టీసీ కార్మికులకు ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ రద్దు సర్కులర్ ను ఉపసంహరించుకోవాలి.
నిజస్వరం తాండూర్ ప్రతినిధి ::
ఆర్టీసీ కార్మికులకు ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ రద్దు సర్కులర్ ను ఉపసంహరించుకోవాలి. (టీ జె యూ ఏం యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్) తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ,
మేనేజింగ్ డైరెక్టర్ ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇకనుండి ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంటు ఇవ్వవద్దని సర్కిలర్ జారీ చేయడాన్ని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ ఖండించారు.
ఆర్టీసీలో ఇప్పటికే చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నారని ఈ చిన్న ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ను ఇకనుంచి ఇవ్వమని చెప్పడం సమంజసం కాదని ఆర్టీసీ కార్మికులందరూ దీనిని వ్యతిరేకిస్తారని అందువలన వెంటనే మేనేజింగ్ డైరెక్టర్ దీని పునః పరిశీలించి ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ రద్దు చేసిన సర్కులర్ ను ఉపసంహరించుకోవాలని హనుమంతు ముదిరాజ్ ఎండి ని కోరారు.
ప్రస్తుతము పని భారం పెరిగిపోయి అనేక ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో ఇంకా కావాలంటే కొత్త రాయితీలు ప్రకటించాలని ఉన్నదాన్ని తీసివేసి ఆర్టీసీ ఉద్యోగులకు నిరుశ్చాహానికి గురి చేయవద్దని ఇప్పటికే చట్టవ్యతిరేక డ్యూటీలతో పెరిగిన పని వారంతో యాజమాన్యం వేధింపులతో సతమతం అవుతున్నారని
కార్మికులు చేసిన కష్టాన్ని గుర్తించి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దీనిపైన దృష్టి కేంద్రీకరించి ఇట్టి సర్కిలను రద్దుచేయించి ప్లానింగ్ ఇంక్రిమెంట్ను కంటిన్యూ చేయాలని హనుమంత ముదిరాజ్ కోరారు.
కావలి హనుమంతు ముదిరాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీ జె యూ ఏం యూ ) తెలియజేశారు.
