🔴 ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక లో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి.
నిజ స్వరూపం తాండూర్ ప్రతినిధి ::
గ్రామ పంచాయతీ – ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక లోభాగంగా తాండూర్ నియోజకవర్గం గౌత పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ దీపక్ తివారి.
బుధవారం గౌత పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రజా పాలనా ప్రగతి పై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలు గురించి సమగ్రంగా చర్చించారు.
గ్రామంలో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రగతి. పై మాట్లాడారు.
గ్రామ పరిశుభ్రత, తాగునీరు, వీధి దీపాలు మరియు ఇతర మౌలిక వసతుల పరిస్థితి పై ఆరా తీశారు.
ప్రజల నుంచి వచ్చిన వినతులు స్వీకరించి, సమస్యల పరిష్కార చర్యలు చెపడతామని తెలిపారు.
గ్రామ అభివృద్ధి కార్యక్రమాల అమలు వేగంగా మరియు పారదర్శకత తో చేయాలనీ అధికారులకు ఆదేశించారు.
గ్రామ ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలని, ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజలతో సమన్వయం కలిగి పని చేయాలని ఆదేశించారు.
గ్రామ అభివృద్ధి మరియు ప్రజా సేవల మెరుగుదల కోసం సమిష్టిగా కృషి చేయాలని అధికారులకు ఆదేశించారు..
గౌత పూర్ పక్కనే ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ను సందర్శించారు
ఉపాధ్యాయులు గా మారి విద్యార్థులకు గణితం బోధించి, విద్యార్థుల చే చదివించారు. ఈ సందర్బంగా కిచెన్ ను పరిశీలించి మెనూ ప్రకారం భోజనం పెట్టాలని అధికారులకు ఆదేశించారు.
చెంగోల్ గ్రామ పంచాయతీ పరిది లో మురికి కాలువ లను పరిశీలించి, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, గ్రామం లో చెత్త సేకరణ జరగాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
తదనంతరం తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రి ని పరిశీలించారు.. ఆసుపత్రి కి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని,
ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యాధికారులు, సిబ్బంది అందుబాటలో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు.
ఐ సి యు, డయాగ్నోస్టిక్ సెంటర్, బ్లడ్ బ్యాంకు, ఎమర్జెన్సీ వార్డ్, జనరల్ వార్డ్,ఐ సి టి సి ల్యాబ్, గర్భిణీ లకు చికిత్స అందించే సెంటర్ ను, మహిళా వార్డ్ ను ఆసుపత్రి లో ప్రతి రూమ్ ను పరిశీలించారు. ఎంతమంది సిబ్బంది హాజరయ్యారని, ఎన్ని అంబులెన్సు లు ఉన్నాయని సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
డాక్టర్స్ సమయ పాలన పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.
అత్యవసర విభాగం సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.శానిటేషన్ సిబ్బంది హాస్పిటల్ ని శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు.ఓపి ని తనిఖీ చేశారు. అవసరమైన మందులను అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. మిషన్ బగీరత వాటర్ సప్లై ఉందా, ఆసుపత్రి లో ఉన్న సమస్య ల పై వివరాలు అడిగి తెలుసు కున్నారు.
ఈ కార్యక్రమం లో జిల్లా విద్యాది కారి రేణుకా దేవి, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆనంద్, తహసీల్దార్ తారా సింగ్, ఎం పి డి ఓ విశ్వ ప్రసాద్, సర్పంచ్ లు సృజన, నర్సమ్మ, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
