కులమతాలకు అతీతంగా ఇఫ్తార్ విందు.

🔴 గౌరారం లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు. హిందూ సోదరులు.

 🔴 కుల మతాలకు అతీతంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన హిందూ సోదరులు.

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు మరియు యువకుల ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేశారు.

వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం గౌరారం గ్రామ పెద్దలు మాట్లాడుతూ మా గ్రామంలో కులమతాలకు అతీతంగా ఎల్లప్పుడూ సోదరా భావంతో కలిసిమెలిసి ఉంటామని అలాగే ఏ సమస్య వచ్చినా కలిసి చేసుకుంటామని మా గ్రామంలో బీద బడుగు వర్గాలు ఉండవని మేమెప్పుడూ అన్నదమ్ముల అక్క చెల్లెళ్ల కలిసి ఉంటామని గ్రామ పెద్దలు తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామంలోని ముస్లిం సోదరులకు స్నేహభావం, ఐక్యతకు ప్రతీకగా ఇఫ్తార్ విందు రూపుదిద్దుకుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గ్రామ సర్పంచ్  కిష్టి బాయ్ రాథోడ్ (సీతారాం),గ్రామ పెద్దలు మరియు రాజకీయ కురువృద్ధుడు కొత్త కాపు నరసింహారెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త ఇండస్ట్రియలిస్ట్ కటకం నరసింహులు, గ్రామ పెద్దలు పట్లోళ్ల వెంకట్ రెడ్డి, యువ నాయకులు కొత్త కాపు శ్రీధర్ రెడ్డి (రెడ్డి ల్యాబ్ ఫార్మసిస్ట్) తపాల ఉద్యోగులు (బి పి ఏం) వెంకటయ్య గౌడ్ ,పసుల వెంకట్ (వార్డ్ మెంబర్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామని గ్రామస్తులు తెలిపారు.

ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో  అల్మిజాన్ టూర్ అండ్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్. మొహమ్మద్ ఫయాజ్ అలీ. మాజీ సర్పంచ్ మహమ్మద్ ఇసాక్ చాంద్ పాష,  మరియు అబ్దుల్ రషీద్ మజార్ కాజా హుస్నావుద్దీన్ సిద్ధికి హాజీ. రిటైర్డ్ ఎస్ఐ యూసుఫ్దిన్ ముక్తార్, మరియు గ్రామ ఉపసర్పంచ్ ఖాజా మైనుద్దీన్, మొహమ్మద్ జావిద్ ఎక్స్ మాజీ సర్పంచ్, మొహమ్మద్ సాజిద్ మొహమ్మద్ ఖలీద్, మొహమ్మద్ బాబర్, మహమ్మద్ ఖలీల్, అబ్దుల్ రైస్ ఇమ్రాన్, మహమ్మద్ ముజాహిద్ అలీ మొహమ్మద్ ముంతాజ్ అలీ, మొహమ్మద్ షఫీ యుద్దీన్, మొహమ్మద్ యూసుఫ్ అలీ.  తదితరులు పాల్గొన్నారు.