కౌంటింగ్ కేంద్రం గేటు వద్ద గందరగోళం.

కౌంటింగ్ కేంద్రం ప్రధాన గేటు వద్ద గందరగోళం

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ మున్సిపల్ కౌంటింగ్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ చైర్మన్ పీఠానికి చెరువులో ఉన్న సమయంలో కౌంటింగ్ కేంద్రం ప్రధాన గేటు వద్ద గందరగోళం నెలకొంది. కౌంటింగ్ ముగింపు దశలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కౌంటింగ్ కేంద్రంలోని మీడియా పాయింట్ కు రావడంతో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కౌంటింగ్ కేంద్రం ప్రధాన గేటు వద్ద పోలీసులకు, పైలెట్ రోహిత్ రెడ్డి వర్గీయుల మధ్య తోపులాట కొనసాగింది. అంతలోనే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తిరిగి వెళుతుండగా పైలెట్ రోహిత్ రెడ్డి వారిపై దూసుకెళ్లారు. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇట్టి విషయంపై జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధారాసింగ్, డిసిసిబి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రవి గౌడ్, జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డే శ్రీనివాస్ లు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి గుండాయిజం రౌడీయిజం తాండూర్లో చెల్లవని అన్నారు. ప్రశాంతంగా కొనసాగిన కౌంటింగ్ ప్రక్రియలో చివరి కొద్ది నిమిషాల్లో ఓడిపోయామని అక్కస్సుతో తప్ప తాగి న్యూసెన్స్ చేయడం మంచిది కాదని హితవు పలికారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునర్ పునరావృతం కాకూడదంటే ఇరువర్గల వారిని వీడియో లో గుర్తించి పోలీసులు వారిపై నార్కోటిక్స్ పరీక్షలు చేయాలని ధారా సింగ్ కోరారు.