తాండూరు బీసీ సంఘం దుకాణాల అద్దె డబ్బులు ఎక్కడ..?

తాండూరు బీసీ సంఘం దుకాణాల అద్దె డబ్బులు ఎక్కడ..?

వికారాబాద్ జిల్లా | తాండూరు

తాండూరులోని బీసీ సంఘానికి సంబంధించిన దుకాణ సముదాయం అద్దె వసూళ్లపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇన్నేళ్లుగా దుకాణాల నుంచి వసూలు చేసిన అద్దె మొత్తం ఎంత?

నెలకు ఎంత అద్దె వస్తోంది?

అద్దెను ఎవరు వసూలు చేస్తున్నారు?

వసూలైన డబ్బులు ఏ ఖాతాలో జమ చేస్తున్నారు?

ఇప్పటివరకు వచ్చిన అద్దెకు సంబంధించిన లెక్కలు ఎక్కడ ఉన్నాయి?

అద్దె వసూళ్లకు సంబంధించిన రశీదులు, బ్యాంకు ఖాతా వివరాలు, ఆదాయ–వ్యయ లెక్కలను బీసీ సంఘం సభ్యులు, ప్రజల ముందు వెల్లడించాలనే డిమాండ్ వినిపిస్తోంది.

బీసీ సంఘం ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయం బీసీల సంక్షేమం, సంఘం అభివృద్ధికి వినియోగిస్తున్నారా? అనే ప్రశ్నలు కూడా చర్చకు వస్తున్నాయి.

ఎమ్మెల్యే ఇచ్చిన రూ.10 లక్షల ప్రొసీడింగ్ ఎక్కడ..?

ఇదే సమయంలో రూ.10 లక్షల ప్రొసీడింగ్‌కు సంబంధించిన వివరాలు ఎక్కడ ఉన్నాయి? అనే ప్రశ్న కూడా ముందుకు వస్తోంది.

ఆ ప్రొసీడింగ్ ఎప్పుడు జారీ చేశారు?

ఎందుకు జారీ చేశారు?

ఆ మొత్తానికి సంబంధించిన నిధులు ఎక్కడ వినియోగించారు?

దానికి సంబంధించిన లెక్కలు, పత్రాలు ఎక్కడ ఉన్నాయి? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అద్దె వసూళ్లపై పూర్తి వివరాలు బయటపెడితే ఇప్పటివరకు ఎంత ఆదాయం వచ్చింది? ఎంత ఖర్చు చేశారు? ప్రస్తుతం ఎంత మిగిలింది? అన్నది స్పష్టమయ్యే అవకాశం ఉంది.

లెక్కలు బయటపెడతారా?

అద్దె డబ్బుల వివరాలు ప్రజలకు చెబుతారా?

రూ.10 లక్షల ప్రొసీడింగ్‌పై స్పష్టత ఇస్తారా?

అనేది ఇప్పుడు తాండూరులో చర్చనీయాంశంగా మారింది.