మెడికల్ సీటు సాధించిన మహేశ్వరికి BSR అభినందనలు
వికారాబాద్ జిల్లా | పెద్దేముల్ మండలం
పెద్దేముల్ మండలం మారేపల్లి గ్రామానికి చెందిన సి. చెన్నప్ప కుమార్తె సి. మహేశ్వరి ప్రభుత్వ మెడికల్ కాలేజ్, జయశంకర్ భూపాలపల్లిలో ఎంబీబీఎస్ సీటు సాధించింది.
ఈ సందర్భంగా RBOL CEO, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (BSR) మహేశ్వరిని అభినందించారు. ఆమెను సత్కరించి, భవిష్యత్లో మంచి వైద్యురాలిగా ఎదిగి ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.
అలాగే చదువుకు సంబంధించిన ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించారు. భవిష్యత్లో కూడా ఎలాంటి సహాయం అవసరమైనా తనను సంప్రదించాలని, తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని BSR భరోసా ఇచ్చారు.
