కల్వకుంట్ల కుటుంబం,వారి ఎమ్మెల్యేలు ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారు..

🔴 పేదోడికి చిన్న ఇల్లు కట్టివ్వలేదు,కానీ కల్వకుంట్ల కుటుంబం,వారి ఎమ్మెల్యేలు ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారు: ఎమ్మెల్యే..

కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పదేళ్లపాటు కల్వకుంట్ల కుటుంబం పాలన సాగిందని,అయితే ఆ పాలనలో నిరుపేదల జీవితాల్లో ఆశించిన మార్పు రాలేదని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో గత బీఆర్ఎస్ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు నిర్మించుకున్న ఫామ్‌హౌస్‌లు, ప్రభుత్వ భూముల అక్రమణకు సంబంధించిన అంశాలను కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ:

“పేదోడికి కనీసం చిన్న ఇల్లు కూడా కట్టించి ఇవ్వలేదు.కానీ అధికారంలో ఉన్న సమయంలో కల్వకుంట్ల కుటుంబం, వారి పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారు.

తెలంగాణ కోసం ప్రజలు చేసిన పోరాటం ఫలాలు సామాన్యులకు అందాల్సి ఉండగా,గత పదేళ్ల పాలనలో ఒకే ఒక్క కుటుంబానికే ప్రయోజనం చేకూరిందనే అన్నారు.

ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫాం హౌస్ భూమిలో నిర్మాణంకు సంబంధించిన అంశాలపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు..

అలాగే, ఫామ్‌హౌస్‌లను డ్రగ్స్ పార్టీలు, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వంటి వివాదాస్పద ఘటనలతో ఈ ఫాం హౌస్ లోనే జరిగాయని అన్నారు..

యువతకు గత బీఆర్ఎస్ నాయకులు ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు.

ఈ పర్యటనలో ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్,బల్మూర్ వెంకట్ ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, ఈర్లపల్లి శంకర్, నవీన్ యాదవ్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు..