సాయిపూర్ రోడ్డుపై ప్రజల అవస్థలు.. రోడ్డు మరమ్మతులు చేపట్టాలని స్థానికుల విజ్ఞప్తి..

వికారాబాద్ జిల్లా …

సాయిపూర్ రోడ్డుపై ప్రజల అవస్థలు..

రోడ్డు మరమ్మతులు చేపట్టాలని స్థానికుల విజ్ఞప్తి..

తాండూర్ పట్టణంలోని సాయిపూర్ రోడ్డులో ఆదిత్య హాస్పిటల్ సమీపంలో రహదారి పరిస్థితి అధ్వానంగా మారడంతో వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై ఏర్పడిన గుంతలు, దెబ్బతిన్న రహదారితో నిత్యం ఉద్యోగులు, విద్యార్థులు, కూలీలు, స్థానిక ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల సమయంలో కౌన్సిలర్‌గా గెలవడానికి లక్షల రూపాయలు ఖర్చు చేసే నాయకులు.. ప్రజలకు ఉపయోగపడే రోడ్డు మరమ్మతుల కోసం కనీసం కొన్ని సిమెంట్ సంచులతో గుంతలను పూడ్చే చర్యలు చేపట్టలేరా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. చిన్నపాటి మరమ్మతులు చేపట్టినా ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని పేర్కొంటున్నారు.

ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్న ఈ రహదారిపై సంబంధిత కౌన్సిలర్, మున్సిపల్ అధికారులు వెంటనే దృష్టి సారించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. రహదారిని బాగు చేయించడం ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, సంబంధిత అధికారులు స్పందించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.