వికారాబాద్ జిల్లా….
తాండూర్‌లో శాంతికి విఘాతం.. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నేతల విరుచుకుపాటు
తాండూర్: పట్టణంలో శాంతియుత వాతావరణానికి బీఆర్ఎస్ నాయకులు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న తాండూర్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొనడానికి బీఆర్ఎస్ నేతలే కారణమని వారు విమర్శించారు. కేవలం ఐదు రోజులు ఉండగానే ఇంత హంగామా చేయడం ఏమిటని ప్రశ్నించారు.
పైలట్ రాకతో బీఆర్ఎస్ రౌడీ బ్యాచ్ హల్చల్ మళ్లీ మొదలైందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. అధికారంలో లేకున్నా ఇంత హంగామా చేస్తున్నారని, భవిష్యత్‌లో అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారని వారు పేర్కొన్నారు.
మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, శ్రీను అన్నతో పాటు కాంగ్రెస్ నాయకుల గురించి తప్పుగా మాట్లాడితే సహించేది లేదని, అలాంటి వ్యాఖ్యలు చేసే వారి నాలుక కోస్తామని యూత్ కాంగ్రెస్ పట్టణ నాయకులు హెచ్చరించారు. అయితే ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే తమ నిరసనను వ్యక్తం చేస్తామని వారు తెలిపారు.
సాయిపూర్‌లో బీఆర్ఎస్‌కు చెందిన ఓ బడా కబ్జా లీడర్ ప్రోత్సాహంతోనే ఈ ఉద్రిక్త వాతావరణం సృష్టిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. గతంలోనూ ఇదే విధంగా వ్యవహరించడంతోనే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‌కు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. అయినప్పటికీ ఆ పార్టీ నాయకుల తీరు మారలేదని విమర్శించారు.
వారు చేస్తున్న దౌర్జన్యాలు, రౌడీయిజాన్ని తాండూర్ ప్రజలు గమనిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. తాండూర్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలని యూత్ కాంగ్రెస్ పట్టణ నాయకులు సందీప్ రెడ్డి,జోగుల ఎబినేజర్ ,బాతులశ్రీకాంత్,సురేష్ గౌడ్ ,శ్రీకాంత్ ముదిరాజ్ , తెలిపారు
