తాండూర్‌లో వరుస చోరీలతో ప్రజల్లో భయాందోళన నేడు మరో చోరీ వెలుగులోకి..

వికారాబాద్ జిల్లా…

తాండూర్‌లో వరుస చోరీలతో ప్రజల్లో భయాందోళన

నేడు మరో చోరీ వెలుగులోకి..

తాండూర్ పట్టణంలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. ఒక్క రోజే నాలుగు చోరీలు జరగడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇంటి యజమానులు లేని ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని దొంగలు వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

జానకిరామ్ నగర్‌లో రెండు బైకులు చోరీ కాగా.. *మరో ఇంట్లో చోరీ వెలుగులోకి వచ్చింది..*

శుక్రవారం  శ్రీరామ్ నగర్‌లోని ఓ ఇంట్లో పది తులాల బంగారం, రెండు కిలోల వెండి, నగదు అపహరణ,అదే కాలనీలో మరో ఇంట్లో కూడా దొంగలు చొరబడి వెండి ఆభరణాలు, నగదును అపహరించినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. శనివారం జానకిరామ్ నగర్‌లో మరో చోరీ వెలుగులోకి వచ్చింది. ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు రెండు తులాల బంగారం, కేజీ వెండి, రూ.50 వేల నగదు అపహరించినట్ల సమాచారం.

వరుస చోరీల నేపథ్యంలో పోలీసులు దొంగల కోసం గాలింపు ముమ్మరం చేశారు.

ఇంటి యజమానులు తిరిగి ఇళ్లకు చేరుకోవడంతో ఒక్కొక్కటిగా చోరీల ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. వరుస చోరీలతో ఆందోళనకు గురవుతున్న ప్రజలు.. దొంగలను త్వరగా పట్టుకుని, తమకు భద్రత కల్పించాలని పోలీసులను కోరుతున్నారు.