ఉట్టిపడిన అభిమానం
సాధారణంగా అభిమానులు సినీ ఇండస్ట్రీలో హీరోలకు, స్టార్ క్రీడాకారులకు అభిమానులు ఉండడం సహజంగా చూస్తుంటాం. అక్కడక్కడ రాజకీయంలో సైతం ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాయకులకు అభిమానులు ఉంటుంటారు. తాండూర్ మున్సిపల్ పరిధిలో 15వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి దివిటి ఎల్లప్ప వీరాభిమానులు ఉన్నామని,15 వార్డ్ చెందిన ఓ యువకుడు కట్టింగ్ రూపంలో తలపై ఎల్లప్ప అని ఆంగ్లంలో అక్షరాలు రాయించుకున్నారు. దీంతో 15వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి గత మూడేళ్లుగా అనునిత్యం అందుబాటులో ఉండడమే కాకుండా, వార్డు ప్రజలకు అనారోగ్యం రీత్యా హైదరాబాద్ తరలించాల్సి వస్తే తన దగ్గర ఉన్న అంబులెన్స్ లను ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు స్థానిక వార్డు ప్రజలు తెలియజేశారు. వీరి మాటల్లో 15వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థిగా గెలిచే అవకాశం మెండుగా ఉన్నట్లు తెలుస్తుంది.
