16వ వార్డులో కాంగ్రెస్ జోరు.

16వ వార్డులో కాంగ్రెస్ జోరు..

శ్రీలత శ్రీకాంత్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి:

టి.పి.సి.సి. మైనార్టీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్ యం.డి.రియాజ్

తాండూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ఊపందుకుంది. శనివారం 16వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి నారా శ్రీలత శ్రీకాంత్ తరపున వార్డు ఇన్చార్జి మరియు టి.పి.సి.సి. మైనార్టీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్ యం.డి.రియాజ్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులను వివరించి, హస్తం గుర్తుకు ఓటు వేసి శ్రీలత శ్రీకాంత్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

ఈ సందర్భంగా యం.డి.రియాజ్ మాట్లాడుతూ.. తాండూర్ శాసనసభ్యులు బి. మనోహర్ రెడ్డి నాయకత్వంలో పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. 16వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తే, ఎమ్మెల్యే సహకారంతో వార్డుకు అధిక నిధులు మంజూరు చేయించి, మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. వార్డు సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నారా అశోక్, ఎం. నర్సింలు, ఖాయుమ్, అజ్జు, రాము, రాజు, చంద్రశేఖర్, గడ్డామిది శివకుమార్ మరియు పార్టీ కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.