ఖాబర్దార్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ నాయకులు నయీం అఫ్ఫూ
నిజ స్వరం తాండూర్: తాండూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టిఆర్ఎస్ పార్టీ తరఫున 29, 30,31 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు ప్రజా ఆశీర్వాద సభను శుక్రవారం తాండూర్ రైల్వే స్టేషన్ కూడలిలో ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం టిఆర్ఎస్ పార్టీ శ్రేణులను, 29,30,31 ఓటర్లను ఉద్దేశించి సభలో మాట్లాడుతూ… మున్సిపల్ పరిధిలోని 30 వార్డ్ మాజీ కౌన్సిలర్, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులుగా కొనసాగిన అఫ్ఫు నయీం కుటుంబ సభ్యులు టిఆర్ఎస్ పార్టీ తరపున నామినేటెడ్ పదవులు అనుభవించే , టిఆర్ఎస్ పార్టీకే వెన్నుపోటు పొడిచారని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు సవాలుగా శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు అఫ్ఫు నయీం మీడియాతో మాట్లాడుతూ.2018 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించమని, తాండూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎలాంటి సమాచారం అందించకుండా స్వార్థ ప్రయోజనం కోసం టిఆర్ఎస్ పార్టీలో చేరి, ఎమ్మెల్యేగా గెలిపించిన కాంగ్రెస్ పార్టీకే వెన్నుపోటు పొడిచిన ముద్ర వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలోనే 24 ఏళ్లుగా పని చేశానని, ఎన్నో రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులు పొంది ప్రజలకు సేవ చేశానని, కాంగ్రెస్ పార్టీ నుంచే నగర, పురపాలక సంఘం ఎన్నికల ఇన్చార్జిగా పనిచేసిన అపార అనుభవం ఉందని, కానీ టిఆర్ఎస్ పార్టీ రాజకీయ స్థాయిని తగ్గిస్తూ తాండూర్ పట్టణ అధ్యక్షుడిగా పరిమితం చేసిందన్నారు.
అభివృద్ధి అంటేనే అఫ్ఫు
తాండూర్ మున్సిపల్ పరిధిలోని 30 వ వార్డు కుమ్మరి గల్లి అభివృద్ధి జరిగిందంటే కేవలం మాజీ కౌన్సిలర్ మెహరాజ్ బేగం నయీం అఫ్ఫు చిత్తశుద్ధితోనే అభివృద్ధికి బాటలో వేశామని అన్నారు. తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి 30 వార్డ్ కి కోటి రూపాయలు నిధులు మంజూరు చేశానని అనడం విడ్డూరం. కోటి రూపాయలు కాదు వంద రూపాయలు 30 వార్డుకు ఇచ్చినట్లు రుజువు చేస్తే రాజకీయం నుంచి తప్పుకోవడమే కాకుండా టిఆర్ఎస్ పార్టీ 30 వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి కి తను ప్రచారం చేస్తానని ఆరోపించారు. 30 వ వార్డులో టిఆర్ఎస్ పార్టీ ఓటమి భయంతోనే తమ కుటుంబం పై, కాంగ్రెస్ పార్టీపై బురదజల్లే, కక్షపూరిత రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు. 30 వార్డు ఓటర్లకు అభివృద్ధి ఎవరు చేశారో, అన్ని తెలుసని ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో వారి ఓటుతో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అదేవిధంగా 30వ వార్డ్ ఓటర్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఈనెల 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పోలింగ్ చెయ్యి గుర్తుకు ఓటేసి అభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనంద్, మహమ్మద్ షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.
