వికారాబాద్ జిల్లా | తాండూర్
తాండూర్ బస్టాండ్ లోపలికి వెళ్లే ముఖద్వారం వద్దా భారీ గోతి.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు
తాండూర్ ఆర్టీసీ బస్టాండ్‌లోకి వెళ్లే ప్రధాన మార్గంలో భారీ గోతి ఏర్పడి బస్సులకు,ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెయిన్ రోడ్డునుంచి బస్టాండ్‌లోకి ప్రవేశించే దారిలో వర్షపు నీరు నిల్వ ఉండటంతో రహదారి పూర్తిగా దెబ్బతిని పెద్ద గోతిగా మారింది.


ఈ గోతి కారణంగా ఆర్టీసీ బస్సులు నెమ్మదిగా, అత్యంత జాగ్రత్తగా బస్టాండ్‌లోకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఆటోలు, ద్విచక్ర వాహనాలు, పాదచారులు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తోంది. ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు ఈ మార్గాన్ని ఉపయోగిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బస్టాండ్‌లోకి అధిక సంఖ్యలో ఆటోలను అనుమతించడం, వర్షపు నీరు సకాలంలో వెళ్లేలా డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల రహదారి పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారిందని స్థానికులు చెబుతున్నారు.
ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెంటనే ఈ గోతిని పూడ్చి, రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.
