వికారాబాద్ జిల్లా తాండూర్…
తాండూరులో BLAలతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం
ఓటు హక్కు పరిరక్షణే BLAల ప్రధాన బాధ్యత: ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి

వికారాబాద్ జిల్లా తాండూరులో ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి, TPCC SIR పర్యవేక్షకులు కోటం వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూరు క్యాంప్ కార్యాలయంలో పట్టణ BLAలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, SIR ప్రక్రియలో BLAలు కీలక పాత్ర పోషిస్తున్నారని, మిగిలిన 10 రోజులు మరింత అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు అత్యంత విలువైన ప్రజాస్వామ్య హక్కు అని, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా ప్రతి BLA బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు.
ఇంటింటికీ వెళ్లి ప్రజలకు SIR ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ, అవసరమైన దరఖాస్తులను సకాలంలో పూర్తి చేయించాలని సూచించారు. తాండూర్ నియోజకవర్గంలో ఇప్పటికే 75 శాతం SIR ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. మిగిలిన ప్రక్రియను కూడా వేగవంతంగా పూర్తి చేసి, ప్రతి అర్హుడి ఓటు హక్కు పరిరక్షించేలా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ప్రతి బూత్, ప్రతి వార్డులో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ప్రజల ఓటు హక్కును పరిరక్షించాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఖచ్చితమైన ఓటరు జాబితా కీలకమని, ఈ బాధ్యతను ప్రతి కార్యకర్త నిబద్ధతతో నిర్వర్తించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ సమావేశంలో TPCC SIR పర్యవేక్షకులు కోటం వినయ్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ SIR కన్వీనర్ పురుషోత్తం రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగరాజు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, BLAలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
