🔴 మైనారిటీ యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు
🟣 వికారాబాద్ జిల్లా నిరుద్యోగ మైనారిటీ యువత విదేశీ ఉపాధి అవకాశాలను
నిజ స్వరూపం తాండూర్ ప్రతినిధి ::
మైనారిటీల సంక్షేమ శాఖ, వికారాబాద్ జిల్లా నిరుద్యోగ మైనారిటీ యువత విదేశీ ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
తేది;06-04-2026
రాష్ట్ర మైనారిటీల సంక్షేమ శాఖ ద్వారా తెలియజేయునది ఏమనగా తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్, హైదరాబాద్ మరియు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ మైనారిటీ యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించుటకు పలు దేశాలలో ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నట్లు జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ అధికారిని శ్రీమతి S.రాజేశ్వరి ఒక ప్రకటన జారి చేస్తూ తెలియజేయడమైనది. జిల్లాలోని అర్హత గల మైనారిటీ నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ వికారాబాద్ అధికారిని S.రాజేశ్వరి కోరడమైనది.
అందుబాటులో ఉన్న విదేశీ ఉద్యోగ అవకాశాలు:
1. జర్మనీ – నర్సింగ్ ఉద్యోగాలు
పోస్టు: రిజిస్టర్డ్ నర్సులు (పురుషులు / మహిళలు)
అర్హత: GNM / B.Sc Nursing
అనుభవం: సంబంధిత అనుభవం అవసరం
వార్షిక వేతనం: సుమారు ₹22 లక్షల నుండి ₹25 లక్షల వరకు
అదనపు ప్రయోజనాలు: OT, ఇతర అలవెన్సులు
భాషా నైపుణ్యం: ఇంగ్లీష్ / అవసరమైతే జర్మన్ శిక్షణ
2. జర్మనీ – ఎలక్ట్రికల్ / పవర్ లైన్ టెక్నీషియన్ ఉద్యోగాలు
అర్హత: డిప్లొమా / బి.టెక్ / సంబంధిత సాంకేతిక కోర్సు
వేతనం: నెలకు సుమారు €2910 (భారత కరెన్సీలో సుమారు ₹3 లక్షలు) ఉచిత వసతి సౌకర్యం
3. ఖతార్ – దోహా – నర్సింగ్ ఉద్యోగాలు
పోస్టు: రిజిస్టర్డ్ నర్సులు
అర్హత: GNM / B.Sc Nursing
అనుభవం: కనీసం 2 సంవత్సరాలు తప్పనిసరి
వేతనం: నెలకు 5000 QAR (సుమారు ₹1,21,000 పైగా)
ఉచిత వసతి, రవాణా, విమాన టికెట్, మెడికల్ ఇన్సూరెన్స్
4. గ్రీస్ – హాస్పిటాలిటీ & ఇతర ఉద్యోగాలు
క్రింది పోస్టులకు ఉద్యోగావకాశాలు కలవు:, హౌస్ కీపింగ్ ,వెయిటర్లు , బార్టెండర్లు ,కుక్స్ , హోటల్ రిసెప్షనిస్ట్ , స్పా థెరపిస్టులు ,ఎలక్ట్రిషియన్లు
ప్లంబర్లు , లైఫ్ గార్డులు ,గార్డెనర్లు , బెల్ బాయ్స్ ,ఫిషర్మెన్
వేతనం: సుమారు ₹97,000 నుండి ₹1,22,000 వరకు నెలకు
సాధారణ నిబంధనలు:
వయస్సు: 21 నుండి 35 సంవత్సరాలు
ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం తప్పనిసరి
2 నుండి 3 సంవత్సరాల అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత
వసతి, ఆహారం, మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా కల్పించబడును
అర్హత గల మరియు ఆసక్తి కలిగిన మైనారిటీ అభ్యర్థులు తమ బయోడేటా / సీవీని వెంటనే tomcomglobal@gmail.com , tomcom.resume@gmail.com ,tomcom.resume@gmail.com లో సమర్పించవలెను. సంప్రదించవలసిన నంబర్లు: 7993357103
జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ వారు తెలియజేశారు.
