ఎమ్మెల్యే సోదరుడికి అధికారం ఎక్కడిది.

తాండూర్ ఎమ్మెల్యే సోదరుడికి అధికారం ఎక్కడిది.

 మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కేసు నమోదు దుర్మార్గం 

మున్సిపల్ ఎన్నికలలో బుయ్యని బ్రదర్స్ బెదిరింపులకు పాల్పడ్డారు.

అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్న పోలీసుల పనితీరు మార్చుకోవాలి.

  శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి సోదరుడు బుయ్యని శ్రీనివాస్ రెడ్డికి ఎలాంటి రాజకీయ పదవి లేనప్పటికీ, ఈనెల 11న జరిగిన మున్సిపల్ పోలింగ్ లో భాగంగా 23వ వార్డ్ సంబంధించి వీవీఎచ్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళినారని, ఎన్నికల సంఘం నియమావళిని ఉల్లంఘించారని తాండూర్ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు మండిపడ్డారు. మంగళవారం తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశంలో పలువురు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాట్లాడుతూ… ఈనెల 13న మున్సిపల్ ఫలితాలు స్థానిక సెంట్ మార్క్స్ జూబ్లీహిల్స్ స్కూల్ ప్రాంగణంలో వెలువడిన సంగతి తెలిసిందే. కాగా మున్సిపల్ పరిధిలోని 09,12,24 వార్డులకు సంబంధించి ఫలితాలు అధికారికంగా వెలువడక ముందే తాండూర్ శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డితో పాటు, డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్, తాండూర్ పట్టణ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాజీ డీసీసీబీ ఉపాధ్యక్షుడు రవి గౌడ్, తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి వీరందరూ కలిసి కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటుచేసిన మీడియా కేంద్రం దగ్గరకు వచ్చి కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన వార్డ్ స్థానాలపై ప్రసంగించారు. ఇదే సమయంలో తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా బందోబస్తు నిర్వహిస్తున్న అక్కడి పోలీస్ సిబ్బంది అడ్డుకోవడంతో పోలీసుల, తాండూర్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మధ్య మాటలతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారని తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పై కేసు నమోదు చేయడంతో తాండూర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు పోలీస్ అధికారులు అధికార కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతూ.. భయం బ్రాంతులకు గురై, ఏకపక్షంగా పోలీస్ విధులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. తాండూర్ పోలీస్ శాఖ విధి నిర్వహణలో చిత్తశుద్ధి కలిగి ఉంటే మున్సిపల్ ఫలితాలు సంపూర్ణంగా వెలువడక ముందే కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించిన తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డితో పాటు, అనుచరులపై ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని వారందరిపై కేసు నమోదు చేయాలని కోరారు. ప్రజాస్వామ్యం మనుగడకు ఎన్నికలే ముఖ్యం. తాండూర్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, సోదరుడు శ్రీనివాస్ రెడ్డి పట్టణ ప్రముఖులను, మరికొందరిని బెదిరింపులకు గురిచేస్తూ బిఆర్ఎస్ పార్టీకి మద్దతు నిరాకరించాలని, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడ్డారని, ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి బిఆర్ఎస్ పార్టీ మద్దతుదారులకు బెదిరించినట్లు ఆరోపించారు. తాండూర్ పట్టణ అభివృద్ధికి బిఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందిన 12 మంది కౌన్సిలర్లు ఎల్లప్పుడూ సహకరించేందుకు ముందుంటారని తెలియజేశారు. అదేవిధంగా తాండూర్ పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో రూ.1000 కోట్ల నిధులు తీసుకొస్తానని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికలు ముగింపు, చైర్ పర్సన్ , వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తయిందని, ఇక తాండూర్ పట్టణ అభివృద్ధికి నిధులపై సీఎం రేవంత్ రెడ్డి పై ఒత్తిడి తేవాలని తాండూర్ బిఆర్ఎస్ పార్టీ నాయకుల తరఫున కోరారు. ఈ కార్యక్రమంలో తాండూర్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు నరుకుల నరేందర్ గౌడ్, మాజీ ఫ్లోర్ లీడర్ బొబ్బిలి శోభ రాణి, టిఆర్ఎస్ పార్టీ బషీరాబాద్, తాండూర్, పెద్దేముల్ మండల అధ్యక్షులు రాజు పటేల్, వీరేందర్, కోహీర్ శ్రీనివాస్, తాజా కౌన్సిలర్ జావిద్ , మాజీ కౌన్సిలర్ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.