తాండూరులో ఆర్టీసీ ప్రయాణికులకు కొత్త సౌకర్యం

తాండూరులో ఆర్టీసీ ప్రయాణికులకు కొత్త సౌకర్యం

ఒక్క ఫోన్‌తోనే బస్సుల సమాచారం

వికారాబాద్ జిల్లా | తాండూరు

తాండూరు ఆర్టీసీ ప్రయాణికులకు బస్సుల సమాచారం ఇక ఒక్క ఫోన్‌తోనే తెలుసుకునే అవకాశం కల్పించినట్లు డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

ప్రయాణికుల సౌకర్యార్థం తాండూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ఎంక్వయిరీ నంబర్ 9063469572 ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ఈ నంబర్‌కు ఫోన్ చేసి ప్రయాణికులు తమ గమ్యస్థానానికి వెళ్లే బస్సుల వివరాలు, సమయాలు, ఇతర ప్రయాణ సమాచారాన్ని తెలుసుకోవచ్చని తెలిపారు. అత్యవసర సమయాల్లోనూ ఈ నంబర్ ద్వారా అవసరమైన సమాచారాన్ని పొందవచ్చని చెప్పారు.

ఆర్టీసీ అందిస్తున్న ఈ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని తాండూరు డిపో అధికారులు కోరారు.

ఎంక్వయిరీ నంబర్: 9063469572

తాండూరు ఆర్టీసీ డిపో