వికారాబాద్ జిల్లా | బషీరాబాద్ మండలం
అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల చర్యలు
బషీరాబాద్ మండలంలోని వీర్సెట్టిపల్లి వాగు నుంచి గొట్టిగ ఖుర్దు గ్రామానికి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు పట్టుకున్నారు.
TG 34 A 3032 నంబర్ గల ట్రాక్టర్ను గొట్టిగ ఖుర్దు గేట్ వద్ద స్వాధీనం చేసుకున్న పోలీసులు.. డ్రైవర్ నర్సింహులు, మొగులప్ప కుమారుడు, గోనూర్ గ్రామం, తాండూర్ మండలంను అదుపులోకి తీసుకున్నారు.
ట్రాక్టర్ను బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు బషీరాబాద్ ఎస్ఐ విఠల్ తెలిపారు. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
