శ్రీ వినాయక ఉత్సవ కమిటీ తాత గుడి సైపూర్‌లో ఘనంగా అన్నదాన కార్యక్రమం.

🔴 శ్రీ వినాయక ఉత్సవ కమిటీ తాత గుడి సైపూర్‌లో ఘనంగా అన్నదాన కార్యక్రమం.

నిజ స్వరం తాండూర్ ప్రతినిధి:: 

వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని సైపూర్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సైపూర్‌లోని తాతాగుడి వద్ద శ్రీ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

శ్రీ వినాయక ఉత్సవ కమిటీ తాత గుడి మరియు ప్రతినిధులు శంకర్ యాదవ్, బంటు మల్లప్ప ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా భక్తులకు అన్నదానం చేయడం ఎంతో సంతృప్తినిచ్చే విషయమని తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజించి, ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో, ఐకమత్యంతో నిర్వహించుకోవాలని కోరారు.

అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు, స్థానికులు నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమం సందర్భంగా భక్తులతో ఉత్సవ ప్రాంగణం సందడిగా మారింది. శ్రీ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానికులు తదితరులు కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.