శ్రీరామ మందిరానికి చేయూత..!
• మండపం నిర్మాణానికి రూ.50 వేల విరాళం
• దాతకు ధన్యవాదాలు తెలిపిన ఆలయ కమిటీ
తాండూర్: పట్టణంలోని శ్రీరామ మందిర పునర్నిర్మాణ పనులకు భక్తులు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలో తాండూర్‌కు చెందిన ప్రముఖ క్యాటరింగ్ వ్యాపారి పి. అశోక్ ఆలయంలో నిర్మిస్తున్న మండపం కోసం రూ.50,000 విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పి. అశోక్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, శ్రీరామ మందిర పునర్నిర్మాణ కార్యక్రమంలో మరింత మంది భక్తులు ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
