వికారాబాద్ జిల్లా…
తాండూరులో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మాంసం దుకాణాలు మూసివేత
తాండూరు: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తాండూరు పట్టణ పరిధిలో మాంసం విక్రయ దుకాణాలు, కబేళాలు, హోటళ్లను మూసివేయాలని తాండూరు పురపాలక సంఘం అధికారులు ఆదేశించారు.
ఈ మేరకు పురపాలక సంఘ కార్యాలయం గురువారం నోటీసు జారీ చేసింది. సెప్టెంబర్ 4న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పట్టణ పరిధిలోని మటన్, చికెన్, చేపల విక్రయ దుకాణాలతో పాటు మేకలు, పశువుల కబేళాలు, హోటళ్లలో మాంసాహార పదార్థాల విక్రయాలను నిలిపివేయాలని సూచించింది.
నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా మాంసాహారాన్ని విక్రయించినట్లు గుర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పురపాలక సంఘం అధికారులు నోటీసులో స్పష్టం చేశారు. జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
