మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు: కౌన్సిలర్ ఇర్షాద్‌కు వార్డు ప్రజల హర్షం

వికారాబాద్ జిల్లా..

ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చిన కౌన్సిలర్ ఇర్షాద్

తాండూర్: ఎన్నికల సమయంలో వార్డు నెంబర్‌ 7 ప్రజలకు ఇచ్చిన హామీని మున్సిపల్ కౌన్సిలర్ షేక్ ఇర్షాద్ అహ్మద్ నెరవేర్చారు. వార్డులోని నాలుగు ప్రాంతాలకు ప్రత్యేక పేర్లు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన మాట మేరకు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో నాలుగు పేర్లను ప్రతిపాదిస్తూ తీర్మానం చేశారు.

వార్డు నెంబర్‌ 7లోని ప్రాంతాలకు కింది పేర్లను ప్రతిపాదించారు.

1. హుస్సేన్ నగర్

2. కోకిల కాటేజ్

3. సుప్రీం కాలనీ

4. విలేమూన్ చౌరస్తా

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని అధికారికంగా కౌన్సిల్ తీర్మానం ద్వారా ముందుకు తీసుకెళ్లడంపై వార్డు నెంబర్‌ 7 ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ ఇర్షాద్ అహ్మద్ మాట్లాడుతూ.. “ప్రజలకు ఇచ్చిన మాటే నాకు ముఖ్యం. హామీ ఇచ్చిన ప్రతి అంశాన్ని దశలవారీగా నెరవేర్చడమే నా లక్ష్యం” అని తెలిపారు.