శ్రీ రామ మందిర నిర్మాణానికి మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్రెడ్డి దంపతుల ఉదార విరాళం

వికారాబాద్ జిల్లా..

శ్రీ రామ మందిర పునర్నిర్మాణానికి రూ.1.11 లక్షల విరాళం

తాండూరు: పట్టణంలోని ఇంద్రనగర్‌లో ఉన్న ఏకైక శ్రీ రామ మందిరం పునర్నిర్మాణానికి మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి దంపతులు చేయూతనందించారు
. దైవభక్తితో ఆలయ పునర్నిర్మాణం కోసం తమ వంతుగా రూ.1,11,000 విరాళాన్ని ఆలయ కమిటీకి అందజేశారు.
ఈ సందర్భంగా దంపతులు మాట్లాడుతూ.. శ్రీ రామ మందిర పునర్నిర్మాణానికి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.
ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. మందిర పునర్నిర్మాణానికి ఉదారంగా విరాళం అందించిన నీరజ బాల్‌రెడ్డి, బాల్‌రెడ్డి దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పటికీ, మండపంతో పాటు మరికొన్ని పనులు ఇంకా మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు. భక్తులు, దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించాలని కోరారు.