వికారాబాద్ జిల్లా…
వన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే BMR
తాండూరు: పట్టణంలోని మెడికల్ కళాశాల (నర్సింగ్ కళాశాల) ఆవరణలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతరులతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
