వికారాబాద్ జిల్లా PAC సమావేశం గాంధీభవన్‌లో కాంగ్రెస్ కీలక భేటీ

గాంధీభవన్‌లో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ PAC సమావేశం

హైదరాబాద్: గాంధీభవన్‌లో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ PAC సమావేశం జిల్లా డీసీసీ అధ్యక్షులు జాదవ్ లోధారాసింగ్ నాయక్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు.

సమావేశంలో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. జిల్లాలో పార్టీ కార్యక్రమాలు, సంస్థాగత వ్యవహారాలు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై సమగ్రంగా సమీక్షించారు.

ఈ సమావేశంలో జిల్లా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, తాండూర్ మున్సిపల్ చైర్‌పర్సన్‌లు నీరజ బాల్ రెడ్డి, గడ్డం అనన్య, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సతీష్ రెడ్డి, మైనారిటీ సెల్ చైర్మన్ ఖాజా ఆమీర్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు శివరామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.