వికారాబాద్ జిల్లా….
నావల్గాలో రైతులతో కలిసి వినూత్నంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
తాండూర్, బషీరాబాద్ మండలం: నావల్గా గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కంజర్ల విజయలక్ష్మి వినూత్నంగా నిర్వహించారు. పచ్చటి పొలాల మధ్య రైతులతో కలిసి ఎడ్లబండిపై ప్రయాణించి జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కంజర్ల విజయలక్ష్మి మాట్లాడుతూ.. దేశానికి రైతే వెన్నెముక అని, అలాంటి రైతులతో కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా పొలం గట్ల మధ్య రైతులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేయడం గర్వంగా, సంతోషంగా ఉందని స్థానిక రైతన్నలు తెలిపారు. ఈ వినూత్న స్వాతంత్ర్య వేడుకలు గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
