జీవన్ వందన ఉత్సవంలో తల్లిదండ్రులకు పాదపూజ

జీవన్ వందన ఉత్సవంలో తల్లిదండ్రులకు పాదపూజ

వికారాబాద్ జిల్లా, తాండూర్:

మార్వాడీ యువ మంచ్ తాండూర్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ కార్యక్రమంలో భాగంగా “జీవన్ వందన ఉత్సవం”ను బాలాజీ మందిర సభా గృహంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా సుమారు 50 మంది మంచ్ సభ్యులు తమ తల్లిదండ్రులకు పాదపూజ చేసి, ఘనంగా సన్మానించారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించి వారి రుణాన్ని తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సార్డా తెలిపారు. పెద్దలను ఎల్లప్పుడూ గౌరవించాలని, సమాజంలో అందరూ ఐక్యంగా, కలిసిమెలిసి ఉండాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా అందించామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో మంచ్ అధ్యక్షులు కిషన్ రాటి, కార్యదర్శి కరణ్ జైన్, అనిల్ సార్డా, కుంజ్ బిహారీ సోనీ, అరుణ్ సార్డా, దీపక్ గగ్రానీ, మహేష్ సార్డా, శ్రీకాంత్ సార్డా, లక్ష్మీ నారాయణ బూబ్, మధు సోనీ, సన్నీ అగర్వాల్, రమాకాంత్ పండిట్, నితిన్ సార్డాతో పాటు సమాజ పెద్దలు, మహిళా మండలి సభ్యులు, మంచ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.