వికారాబాద్ జిల్లా..
తాండూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు నోట్స్ పంపిణీ
తాండూరు: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నోట్స్‌ను విద్యార్థులకు పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థికి అవసరమైన విద్యా సామగ్రి అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.
కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు నోట్స్ అందజేశారు. విద్యార్థులు నోట్స్‌ను సద్వినియోగం చేసుకుని పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆమె ఆకాంక్షించారు.
విద్యార్థుల భవిష్యత్తుకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
